Prabhas Speech Kalki 2898AD Pre Release | కల్కి ప్రీరిలీజ్ లో ప్రభాస్ స్పీచ్ | ABP Desam

ముంబైలో కల్కి 2898AD ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈవెంట్ లో హీరో ప్రభాస్ షూటింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి, అమితాబ్, కమల్ హాసన్ లతో నటించిన అనుభవం గురించి మాట్లాడారు.

జూన్ 27న 'కల్కి 2898 ఏడీ' తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో అందుకు తగ్గట్టు వీలైనన్ని థియేటర్లలో విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. దీపికా పదుకోన్ కాకుండా దిశా పటానీ మరొక కథానాయికగా నటించిన ఈ సినిమాలో లెజెండరీ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, తమిళ నటుడు పశుపతి, సీనియర్ హీరోయిన్ శోభన కీలకమైన ప్రధాన పాత్రలు పోషించారు. 'మహానటి' తర్వాత దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన చిత్రమిది. సైన్ ఫిక్షన్ జానర్‌లో తీసిన టైమ్ ట్రావెల్ ఫిల్మ్ ఇది.

హిందీ చిత్రసీమలో ప్రభాస్ స్టార్ కావడం వెనుక, అతని ఫాలోయింగ్ వెనుక దర్శక ధీరుడు రాజమౌళి తీసిన 'బాహుబలి' ఉంది. అందులో ప్రభాస్ టైటిల్ రోల్ చేయగా... భల్లాలదేవ పాత్రలో మైటీ రానా దగ్గుబాటి నటించారు. ఇప్పుడు 'కల్కి 2898 ఏడీ' ప్రచారం కోసం ఆయన మరోసారి ముందుకు వచ్చారు. ముంబైలో ప్రీ రిలీజ్ వేడుకలో వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola