పాతిక లక్షల పరిహారం ఇచ్చినా అరెస్ట్
అల్లు అర్జున్ అరెస్ట్‌తో ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ అయింది. సంధ్య థియేటర్ కేసులో అల్లు అర్జున్‌ని A11 గా చేర్చిన పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే...ఈ ఘటన గురించి తెలిశాక అల్లు అర్జున్ రెస్పాండ్ అయ్యాడు. ఆ కుటుంబానికి పరిహారం కింద పాతిక లక్షలు ప్రకటించాడు. ఎప్పుడూ ఆ ఫ్యామిలీకి అండగా ఉంటామని భరోసా ఇచ్చాడు. ఆ సమయంలో ప్రత్యేకంగా ఓ వీడియో కూడా విడుదల చేశాడు. తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయారని తెలిసి చాలా బాధ అనిపించిందని చెప్పాడు అల్లు అర్జున్. సుకుమార్‌తో పాటు సినిమా టీమ్ అంతా దిగ్భ్రాంతికి లోనయ్యిందని వెల్లడించాడు. అయితే...అంత త్వరగా స్పందించి పరిహారం అందించడంతో పాటు వాళ్లకి సారీ కూడా చెప్పిన అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అసలు ఈ అరెస్ట్ వెనకాల పొలిటికల్ ఇన్‌ఫ్లుయెన్స్ కూడా ఉందన్న డిబేట్ సోషల్ మీడియాలో గట్టిగానే జరుగుతోంది. మొత్తానికి అల్లు అర్జున్ అరెస్ట్ అవడం మాత్రం సంచలనమవుతోంది.