Pavitra Bandham Chandu Wife Sirisha Comments | సీరియల్ నటుడు చందు మృతిపై భార్య శిరీష సంచలన నిజాలు | ABP Desam

సీరియల్ నటుడు చందు ఆత్మహత్యపై అతని భార్య శిల్ప స్పందించారు. అయిదేళ్లుగా సీరియల్ నటి పవిత్రతో చందు సహజీవనం చేస్తున్నాడని ఆరోపించారు. నటుడు చందు తన వెంటపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, తమకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని చెప్పారు. త్రినయని సీరియల్ ప్రాజెక్ట్ వచ్చిన దగ్గర నుంచి పవిత్రతో చందుకు సంబంధం మొదలైందని, పవిత్ర పైన చందు విపరీతమైన ప్రేమ పెంచుకున్నాడని తెలిపారు. పవిత్రతో రిలేషన్‌లో ఉంటూ తనను, పిల్లల్ని వదిలేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. తనతో చందు ఐదు సంవత్సరాల నుంచి మాట్లాడటం లేదన్నారు. పవిత్రకు చందు కంటే ముందు నుంచి చాలా మందితో సంబంధం ఉందన్నారు. పవిత్ర సడెన్‌గా చనిపోవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లి మూడు రోజుల క్రితం చేయి కోసుకున్నాడని తెలిపారు. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఫ్లాట్‌కు తెలిసిన వాళ్లని పంపించామని, అప్పటికే ఆత్మ హత్య చేసుకున్నాడని చెప్పారు. తనకు, తన పిల్లలకు న్యాయం జరగాలని శిల్ప డిమాండ్ చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola