Dhootha Web Series Review: నాగచైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ దూత- బావుందా? బాలేదా?
దర్శకుడు విక్రమ్ కె కుమార్ శైలి వేరు. '13బి', 'ఇష్క్', 'మనం', '24' వంటి మెమరబుల్ ఫిల్మ్స్ ఇచ్చారు. ఆయన తొలిసారి దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ 'దూత'. ఇందులో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించడం మరో స్పెషాలిటీ. '13బి' తర్వాత సూపర్ నేచురల్ జానర్ మరోసారి టచ్ చేశారు విక్రమ్ కె కుమార్. అతీంద్రియ శక్తుల నేపథ్యంలో ఆయన తీసిన 'దూత' ఎలా ఉంది?