ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధం

డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ అరెస్ట్‌కి రంగం సిద్ధమైంది. ఏ క్షణాన అయినా ఆయనను అరెస్ట్ చేసే అవకాశముంది. ఇప్పటికే ఆర్‌జీవీ ఇంటి ముందు ఒంగోలు పోలీసులు మొహరించారు. గతంలో పెట్టిన సోషల్ మీడియా పోస్ట్‌లు ఇప్పుడు ఆయన నెత్తిని చుట్టుకున్నాయి. వ్యూహం సినిమా టైమ్‌లో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్ట్‌లు పెట్టారని RGVపై ఆరోపణలు వచ్చాయి. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలానికి చెందిన టీడీపీ నేత రామలింగయ్య ఆర్‌జీవీపై ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో ఇప్పటికే రెండుసార్లు పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని నోటీసులివ్వగా..రెండుసార్లు కూడా విచారణకు ఆర్జీవీ డుమ్మాకొట్టారు. దీంతో నేరుగా ఇంటిలోనే విచారణ చేసేందుకు ఒంగోలు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. అయితే..ఆర్‌జీవీ హైదరాబాద్‌లో లేడని, కోయంబత్తూర్‌కి వెళ్లాడని అంటున్నారు. డిజిటల్ విచారణకు హాజరవుతామని చెప్పామని, అయినా పోలీసులు ఇంటికి వచ్చారని ఆర్‌జీవీ అడ్వకేట్ వాదించారు. విచారణకు రావడానికి రెండు వారాల గడువు కోరినట్టు చెప్పారు. ప్రస్తుతం ఆర్‌జీవీ ఎక్కడున్నారో తెలియదని వెల్లడించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola