NTR Trivikram Movie | రూట్ మారుస్తున్న త్రివిక్రమ్ ?

స్టార్ అల్లు అర్జున్‌తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ మైథలాజికల్ మూవీ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇది పాన్ వరల్డ్ రేంజ్ మూవీ అంటూ భారీ హైప్ క్రియేట్ కాగా ... అంతా ఎంతో ఆసక్తిగా అనౌన్స్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. కానీ బన్నీ అట్లీతో మూవీని అధికారికంగా ప్రకటించేశారు.

బన్నీ అట్లీతో మూవీ పూర్తైన తర్వాతే త్రివిక్రమ్ మూవీ చేసే ఛాన్స్ ఉండడంతో ఆ మైథలాజికల్ మూవీని ఎన్టీఆర్‌తో చేయాలని ప్లాన్ చేస్తున్నారట మాటల మాంత్రికుడు. ఈ క్రేజీ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ స్టోరీని ఎన్టీఆర్ కు వినిపించినట్లుగా ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ మైథలాజికల్ స్టోరీకి ఎన్టీఆర్‌ కరెక్ట్‌గా సరిపోతాడని మాటల మాంత్రికుడు భావిస్తున్నారట. మరి అదే నిజమైతే మరో క్రేజీ కాంబో.. ఇంట్రెస్టింగ్ మైథలాజికల్‌తో త్వరలోనే మూవీ సెట్స్‌పైకి వెళ్లే ఛాన్స్ ఉంది.

ఇక ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీతో బిజీగా ఉన్నారు. చరణ్‌తో త్రివిక్రమ్ వచ్చే ఏడాది మూవీని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వెంకీ, రామ్ చరణ్‌లతో మూవీ తర్వాతే ఈ మైథలాజికల్ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఇలా వరుస ప్రాజెక్టులు లైనప్‌లో పెడుతున్నారు త్రివిక్రమ్.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola