Nithilan Swaminathan Explained Maharaja: మహారాజ స్క్రీన్‌ప్లే గురించి చెప్పిన డైరెక్టర్
బుచ్చిబాబుతో మహారాజా టీమ్ ఇంటర్వ్యూ. ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసిన హీరో విజయ్ సేతుపతి:
మహారాజ (విజయ్ సేతుపతి) ఓ సామాన్య బార్బర్. ఓ ప్రమాదం కారణంగా తన బిడ్డ జ్యోతి (సచనా నమిదాస్) నెలల పసికందుగా ఉన్నప్పుడు భార్య (దివ్య భారతి) మరణిస్తుంది. ఆ ప్రమాదంలో పాప ప్రాణాలతో ఉండటానికి కారణమైన చెత్త బుట్టకు లక్ష్మి అని పేరు పెట్టిన తండ్రి కుమార్తెలు... దేవతను చూసుకున్నట్టు చూసుకుంటారు. స్పోర్ట్స్ క్యాంపు కోసం జ్యోతి వేరే ఊరు వెళ్లిన సమయంలో... ఒక రోజు మహారాజాను చితక్కొట్టిన దొంగలు లక్ష్మీని తీసుకు వెళతారు. దాంతో తన కుమార్తె తిరిగొచ్చే లోపు ఎలాగైనా లక్ష్మీని వెతికి పెట్టమని పోలీసుల దగ్గరకు వెళతాడు.
చెత్త బుట్ట పోయిందని చెప్పేసరికి పోలీసులు ఎలా రియాక్ట్ అయ్యారు? ఆ చెత్త బుట్టలో మహారాజ ఏం దాచాడు? ఎలక్ట్రిక్ షాప్ యజమానిగా పగలు మంచివాడిగా నటిస్తూ రాత్రుళ్లు దొంగతనాలు చేసే సెల్వ (అనురాగ్ కశ్యప్) ముఠాకు, మహారాజ ఇంటిలో లక్ష్మీకి సంబంధం ఉందా? నిజంగా లక్ష్మి (చెత్తబుట్ట) కోసమే మహారాజ పోలీసుల దగ్గరకు వెళ్లాడా? మరొక కారణం ఉందా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.