Nidhhi Agerwal Samantha Anasuya Incidents | హీరోయిన్లతో అసభ్య ప్రవర్తన..ఎటు పోతోంది సమాజం | ABP Desam

Continues below advertisement

తోడేళ్లకు తోడబుట్టినార్రా? ఆడది కనిపిస్తే ఆ ధ్యాసేనా? మొన్న నిధి అగర్వాల్ ఇన్సిడెంట్.. నిన్న సమంత ఇన్సిడెంట్. ఎవడైనా వాళ్లని ఫ్యాన్స్ అని అనగలరా? వాళ్లంతా పశువులు.. అంతకంటే హీనమేమో. రాజాసాబ్ ఈవెంట్‌ కోసం కేపీహెచ్‌బీలోని లూలూ మాల్‌లో రాజాసాబ్ సాంగ్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌కి మూవీ హీరోయిన్ నిధి అగర్వాల్ వచ్చి.. ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేసి.. రిటర్న్ అయ్యే టైంలో చుట్టూ ఉన్న జనాలు ఒక్కసారిగా ఆమెని సరౌండ్ చేసి అత్యంత అసభ్యంగా బిహేవ్ చేశారు. ఆమె డ్రెస్ కూడా జారిపోయేటంత జుగుప్సాకరంగా ఆమెని తాకుతూ, నెడుతూ తల్చుకుంటేనే అసహ్యం వేసేలా బిహేవ్ చేశారు. వాళ్లందరి నుంచి బాడీగార్డ్స్ సహాయంతో ఎలాగోలా అతి కష్టం మీద కారు వరకు చేరుకున్న నిధి.. లోపల కూర్చుని చాలా బాధపడ్డారు. ఇక నిన్న ఆదివారం.. జూబ్లీహిల్స్‌లో సమంతకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఓ షోరూమ్ ఓపెనింగ్‌కి వచ్చిన సమంత.. రిటర్న్ వెళ్లే టైంలో ఒక్కసారిగా జనాలు ఎగబడ్డారు. అంతా ఒక్కసారిగా ముందుకు రావడంతో సెక్యూరిటీ వాళ్లని అడ్డుకోవడం చాలా కష్టమైంది. దీంతో కొంతమంది సమంతని అసభ్యంగా టచ్ చేస్తూ.. ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేశారు. ఇదంతా భరిస్తూనే అతి కష్టం మీద కాకు దగ్గరకి చేరుకుని వెళ్లిపోయారు సమంత. ఇదతా ఓ ఎత్తైతే.. ఈ ఇన్సిడెంట్లపై స్పందించిన నటి అనసూయకు ట్విటర్లో ఎదురైన అనుభవం ఇంకో ఘోరం.  అనసూయ ఈ మధ్యనే ఇన్‌స్టాలో తను శారీ స్టిల్స్ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ కింద ఒక యూజర్.. ‘నిన్న నిధి అగర్వాల్‌ని చేసినట్లు నలిపేయాలి పబ్లిక్‌లో దీన్ని..’ అంటూ ఫైర్ ఎమోజీలతో కామెంట్ చేశాడు. అసలు ఈ కామెంట్ చూసి అనసూయ కూడా సీరియస్‌గా రియాక్ట్ అయింది.  ‘ఏం అనాలి ఇలాంటి వాళ్లని..? నిన్న నిధి ఇన్సిడెంట్ చూసి నేను వణికిపోయాను. పాపం నిధి.. ట్రామాలోకి వెళ్లిపోయి ఉంటుంది. ఇలాంటి వాళ్లని ఊరకనే వదలకూడదు.. ’ అని రిప్లై ఇవ్వడమే కాకుండా.. సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ వాళ్లని ట్యాగ్ చేసి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలంటూ కామెంట్ చేసింది. అయితే ఈ రిప్లై గురించి పక్కన పెడితే.. ఒక్కసారి ఆ సైకోగాడి మెంటాలిటీ ఏంటో ఊహించండి. ఓ అమ్మాయిని తోడేళ్లలా చుట్టుముట్టి.. ఉక్కిరిబిక్కిరి చేస్తే.. అదేదో గొప్ప పనిలా.. సైకో శాటిస్‌ఫ్యాక్షన్ పొందుతూ.. అనసూయని కూడా అలా చేయాలి అనడం దారుణం అంతే. ఇలాంటి వాళ్లని ఏం చేయాలి? వీళ్లలాంటి వాళ్లని చూస్తే.. నిజంగానే బతికుండగానే జీవాలని పీక్కుతినే తోడేళ్లే బెటరేమో అనిపిస్తుంది. చివరిగా ఒక్కటే మాట.. నిధి అగర్వాల్ ఫేస్ చేసిన ఘటన.. మగాడు గర్వపడే ఘటన మాత్రం కాదు.. మొత్తం మగజాతి సిగ్గుపడాల్సిన విషయం గుర్తుంచుకోండి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola