ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ధనుష్‌పై మరోసారి సంచలన పోస్ట్ పెట్టింది నయనతార. కానీ..ఈ సారి ఇన్‌డైరెక్ట్‌గా ఫైర్ అయింది. ఎక్కడా పేరు ప్రస్తావించకుండానే తాను చెప్పాలనుకున్న పాయింట్‌ని చాలా స్ట్రాంగ్‌గా చెప్పింది నయన్. ఆమె బర్త్‌డే సందర్భంగా నెట్‌ఫ్లిక్స్‌లో బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌ అనే డాక్యుమెంటరీ రిలీజ్ అయింది. దీనిపై మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కొంత మంది బాగుందని చెబుతుంటే..మరికొందరు బోరింగ్ అంటున్నారు. ఈ రివ్యూల సంగతి పక్కన పెడితే..నయన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ లెటర్ పోస్ట్ చేసింది. ఈ డాక్యుమెంటరీలో నయనతార యాక్ట్ చేసిన కొన్ని సినిమాల క్లిపింగ్స్‌ వాడారు. అయితే...ఆ క్లిప్స్‌ని యూజ్ చేసుకునేందుకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చిన ప్రొడ్యూసర్స్ అందరి పేర్లూ మెన్షన్ చేస్తూ ఈ లెటర్‌ షేర్ చేసింది. బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్, టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి పేర్లు అందులో ప్రస్తావించింది. తమిళ ఇండస్ట్రీలోని ప్రొడ్యూసర్‌లు, ప్రొడక్షన్ హౌజ్‌ల లిస్ట్‌నీ షేర్ చేసింది. వీళ్లంతా తనకు ఎంతో సహకరించారని చాలా స్పెషల్‌గా మెన్షన్ చేసింది. ముఖ్యంగా NOC ఇవ్వడంలో ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఆలస్యం చేయకుండా ఇష్యూ చేశారని థాంక్స్ చెప్పింది నయన్. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola