Navadeep on Rave Parties | రేవ్ పార్టీ అంటే ఏంటో చెప్పిన హీరో నవదీప్ | ABP Desam

Continues below advertisement

లవ్ మౌళి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో నవదీప్, డైరెక్టర్ అవనీంద్ర మీడియాతో మాట్లాడారు. రేవ్ పార్టీల ఇష్యూపై మీడియా అడిగిన ప్రశ్నలకు హీరో నవదీప్ సమాధానమిచ్చా రు. నవదీప్ హీరోగా నటించిన సినిమా 'లవ్ మౌళి'. నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ సంస్థలతో కలిసి సి స్పేస్ చిత్రాన్ని నిర్మించింది. దీనికి అవ‌నీంద్ర ద‌ర్శ‌కత్వం వహించారు. ఈ సినిమా నుంచి ఆల్రెడీ విడుదలైన నవదీప్ లుక్స్, సినిమా టీజర్, 'ఏంత‌మ్ ఆఫ్ ల‌వ్ మౌళి' పాటకు మంచి స్పంద‌న వ‌చ్చింది. 'న‌వ్ దీప్ 2.O' అని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. నవదీప్ అంత కొత్తగా ఉన్నారని చెబుతున్నారు. ‘లవ్ మౌళి’ ట్రైలర్ పూర్తిగా 4 నిమిషాల నిడివి ఉంది. ఇక ట్రైలర్‌లో ఫస్ట్ హాప్ దాదాపుగా మంచి విజువల్స్‌తో నిండిపోయింది. ఆ తర్వాతే ప్రేమ కోసం మౌళి వేట మొదలవుతుంది. తనకు ఎలాంటి అమ్మాయి కావాలో పెయింటింగ్ రూపంలో చెప్పడానికి ప్రయత్నిస్తాడు. అలాగే ఒక అమ్మాయిని పెయింట్ చేస్తాడు. అనూహ్యంగా ఆ పెయింటింగ్‌లోని అమ్మాయి ప్రాణం పోసుకుంటుంది. అంతా బాగుంది అనుకునే సమయానికి ఆ అమ్మాయి తనకు నచ్చదు. దీంతో ఇంకొక అమ్మాయిని పెయింట్ చేస్తాడు. అలా ఒకరి తర్వాత ఒకరిని తన క్రూర మనస్తత్వంతో దూరం చేసుకుంటూ ఉంటాడు మౌళి. ఇలా ‘లవ్ మౌళి’ టీజర్‌లోనే దాదాపుగా కథ మొత్తం బయటపెట్టేశారు మేకర్స్. ముఖ్యంగా నవదీప్ మనస్తత్వం ఎలా ఉంటుందో ట్రైలర్‌లోనే బయటపడింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram