𝑵𝒂𝒏𝒊 𝑾𝒊𝒕𝒉 𝑴𝒐𝒖𝒍𝒊 | లవ్ మౌళి కోసం పెయింటర్ గా మారిన నాని | Nani | Navdeep | ABP Desam

నవదీప్ హీరోగా నటించిన లవ్ మౌళి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాని, నవదీప్ తో కలిసి పెయింటింగ్ ఎక్స్ పో పెట్టారు. తన లవ్ స్టోరీ చెప్పటంతో పాటు తను చూసిన లవ్ స్టోరీ సినిమాల గురించి మాట్లాడాడు నేచురల్ స్టార్ నాని.  తెలుగు సినీ అభిమానులకు హీరో నవదీప్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు. ‘జై’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు నవదీప్. తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ‘గౌతమ్ ఎస్ఎస్సీ’, ‘చందమామ’ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుసగా కొన్ని హిట్స్ పడినా, ఆ తర్వాత అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు. మెగా ఫ్యామిలీతో తనకు ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా వారి సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నాడు. చాలా కాలం తర్వాత నవదీప్ హీరోగా 'లవ్ మౌళి' సినిమా రాబోతోంది. పంఖురి గిద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.  భావన సాగి మరో ముఖ్యపాత్రలో కనిపించనుంది. అవ‌నీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జూన్‌ 7న  విడుదల చేస్తున్నారు. నవదీప్ చివరి సారిగా ‘న్యూసెన్స్’ అనే వెబ్ సిరీస్ లో కనిపించాడు. ఇందులో బిందు మాధవి ఫీమేల్ లీడ్ లో కనిపించింది. శ్రీ ప్రవీణ్ ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించాడు.  

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola