Daaku Maharaaj Trailer Decode | బాలకృష్ణతో కలిసి బాబీ ఆడిస్తున్న మాస్ తాండవం | ABP Desam
డైరెక్టర్ బాబీ కొత్త ప్రయోగం చేశారు. జనరల్ గా బాలకృష్ణ సినిమా ట్రైలర్ అంటే డైలాగులతో హోరెత్తి పోద్ది. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన అన్ని బాలకృష్ణ సినిమాల ట్రైలర్ కట్స్ కి అదే ప్యాట్రన్. కానీ దాన్ని బాబీ ఛేంజ్ చేశారు. ఓవరాల్ గా డాకు మహారాజ్ కథేంటో ట్ర్రైలర్ లోనే చెప్పేశారు. ప్రజలను బానిసలుగా మార్చుకుని పీడించుకు తినే రాబందుల పాలిట డాకూగా...ఆగడాలకు బలైపోతున్న అమాయక ప్రజలను కంటిరెప్పలా కాపాడుకనే మహారాజుగా...మొత్తంగా డాకూ మహారాజ్ గా బాలకృష్ణ ను ఇంట్రడ్యూస్ చేశారు బాబీ. మూడు వేర్వేరు గెటప్స్ లో మూడు వేరియషన్స్ లో బాలకృష్ణ కనిపిస్తున్నారు. డాకూ మహారాజ్, సీతారాం, నానాజీ పేర్లతో ఆయన క్యారెక్టర్లను చూపించారు. మరి బాలయ్య ట్రిపుల్ యాక్షన్ చేశారా లేదా స్క్రీ న్ ప్లే ప్రకారం క్యారెక్టర్ వేరియషన్స్ చూపించారా చూడాలి. బాబీ డియోల్, రవికిషన్ విలనీ కనిపించింది ట్రైలర్ లో. శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైశ్వాల్ కూడా కనిపించారు. థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ యాజ్ యూజువల్ గా బాలయ్య సినిమాకు పూనకం వచ్చినట్లు కొట్టాడు. ట్రైలర్ లో చివర్లో మాత్రమే పేరంటని అడిగితే మైకేల్ జాక్సన్ అని చెప్పారు బాలకృష్ణ. అదొక్కటే ట్రైలర్ లో ఆయన మాట. కథ ఏంటో చేప్పేసి..హైప్ తగ్గించి..డైలాగులన్నీ హాల్లోనే మోగించాలని బాబీ ఫిక్స్ అయ్యారో ఏమో. మొత్తంగా ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 ప్రపంచవ్యాప్తంగా విడుదలై సందడి చేయనుంది.