‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఇండియాలోనే టాప్ డైరెక్టర్లలో ఒకడైన లోకేష్ కనగరాజ్, సూపర్ స్టార్ రజనీకాంత్‌ల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ‘కూలీ’. ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున విలన్ రోల్‌లో నటిస్తున్నారు. ఇందులో ఆయన పాత్ర పేరు సైమన్. కూలీ సినిమా షూటింగ్‌లో నాగార్జున నటించిన వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో లీకైంది. ఈ వీడియో చూసి తెలుగు ఆడియన్సే కాకుండా తమిళ ప్రేక్షకులు కూడా షాక్ అవుతున్నారు. అంత భయంకరమైన విలన్‌గా లోకేష్ కనగరాజ్ నాగార్జునను చూపించారు. వైట్ అండ్ వైట్ సూట్‌లో నాగార్జున ఒకరిని సుత్తితో కొట్టి చంపే సీన్ ఆన్‌లైన్‌లో లీక్ అయింది. లోకేష్ కనగరాజ్ క్రియేట్ చేసిన క్యారెక్టర్స్‌లో రోలెక్స్ అన్నిటికంటే స్పెషల్. సూర్య పెర్ఫార్మెన్స్ ఆ పాత్రకు ఒక ప్రత్యేకతను, క్రూరత్వాన్ని తీసుకువచ్చింది. కానీ ఇప్పుడు నాగార్జున పోషిస్తున్న సైమన్ పాత్ర... ఈ రోలెక్స్‌ను మించేలా ఉందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. కేవలం నాగార్జున లుక్‌తోనే లోకేష్ కనగరాజ్ ఈసారి రూ.1000 కోట్లు కొడతాడని ఆడియన్స్ అంచనా వేస్తున్నారు. 2025 జూన్‌లో ‘కూలీ’ ఆడియన్స్ ముందుకు వస్తుందని తెలుస్తోంది. మరి రజనీకాంత్ ‘కూలీ’గా ఎన్ని రికార్డులు కొడతాడో చూడాలి!

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola