Nagarjuna apologise to Special Abled Fan | నాగార్జునను కలవాలని అభిమాని - బాడీ గార్డ్ దురుసు ప్రవర్తన

 ధనుష్ హీరోగా నాగార్జున ముఖ్యపాత్రలో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న సినిమా కుబేర. ఈ సినిమా షూటింగ్ కోసం నాగార్జున, ధనుష్ ముంబై ఎయిర్ పోర్ట్ కు వచ్చారు. నాగ్ అండ్ ధనుష్ కి సెక్యూరిటీ కల్పించేందుకు అక్కడ బాడీ గార్డ్స్ ని అపాయింట్ చేసుకున్నారు. అయితే ఇది చూడండి పాపం ఈయన చూడటానికి స్పెషల్ ఎబేల్డ్ పర్సన్ లా ఉన్నారు. బట్ ఆయన అక్కడ ఏదో రెస్టారెంట్ లో ఉద్యోగం చేస్తున్నారు. నాగార్జున అంటే అభిమానం ఏమో ఆయన్ను కలవాలని ఓ రెండు మూడు అడుగులు ముందుకు వేశారు. నాగార్జున ఆయన్ను చూసుంటే ఆగేవారేమో. బట్ అలా జరగలేదు. నాగార్జున పక్కనే ఉన్న ఈ బార్డీ గాడ్  ఆ అభిమానిని లాగి పక్కకు విసిరేశాడు. ఆ బాడీ గార్డ్ విసిరిన వేగానికి ఆ అభిమాని అదుపుతప్పి పడిపోయేవాడు కూడా. అంత వేగంగా ఈడ్చి పడేశాడు. నాగార్జున వెనుకనే ఉన్న ధనుష్ ఈ ఘటనను చూసిన పెద్దగా పట్టించుకోలేదు. తన కుమారుడితో కలిసి ముందుకు వచ్చేశారు ధనుష్. బట్ నాగార్జున పట్టించుకోనట్లు వ్యవహరించారని..మానవత్వం అనేది ఉందా అసలు అంటూ బాలీవుడ్ మీడియా ఈ వీడియోను వైరల్ చేసింది. ఈ సంగతి నాగార్జునకు తెలిసినట్లు ఉంది. ఆయన ట్వీట్ ఒకటి పెట్టారు. ఇప్పుడే ఈ వీడియో చూశానని..ఇలా జరిగి ఉండకూడదని తనని కలిసేందుకు వచ్చిన ఆ అభిమానికి క్షమాపణలు చెబుతున్నానని నాగార్జున ట్వీట్ చేశారు. ఫ్యూచర్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్త పడతానని రాశారు. పాపం ఆ స్పెషల్ ఏబుల్డ్ మేన్ ఎంత ఫీలయ్యారో ఏంటో అంటూ నెటిజన్లు సింపతీ చూపిస్తూనే బాడీ గార్డ్స్ కి ఇంత పొగరు ఉండకూడదని..మేం సినిమాలు చూస్తేనే వాళ్లంతా హీరోలుగా కొనసాగుతున్నారంటూ మండిపడుతున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola