Sai Dharam Tej Health Status : ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవుతోన్న సాయి ధరమ్ తేజ్.. బయటకొచ్చిన వీడియో..
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మెగాహీరో సాయి ధరమ్ తేజ్ ట్రీట్మెంట్ కి స్పందిస్తోన్న వీడియో ఒకటి బయటకొచ్చింది. నిన్న అపస్మారక స్థితిలోకి వెళ్లిన ధరమ్ తేజ్.. డాక్టర్లు పిలిచినప్పుడు తన చేయిని కదిలించడం స్పష్టంగా కనిపిస్తోంది. అలానే మాట్లాడడానికి కూడా ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం తేజుని అపోలో హాస్పిటల్ లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కాసేపటి క్రితమే సాయి ధరమ్ తేజ్ హెల్త్ స్టేటస్ కి సంబంధించి ఓ బులెటిన్ విడుదల చేశారు. ఈరోజు కూడా ఐసీయూలోనే తేజుకి ట్రీట్మెంట్ అందిస్తామని వెల్లడించారు.