Muralimohan About Ram Gopal Varma | ఆర్జీవీ గురించి బాలీవుడ్‌లో శ్రీదేవి ఏం చెప్పారు? | ABP Desam

రామ్ గోపాల్ వర్మ గురించి మురళీమోహన్ ఒక ఈవెంట్‌లో మాట్లాడారు. ఒకప్పటి ప్రముఖ హీరోయిన్ శ్రీదేవి బాలీవుడ్‌లో గొప్పగా చెప్పారని తెలిపారు. ఆర్జీవీ తన వివాదాస్పద కామెంట్స్ కారణంగా ఎప్పుడూ వివాదాల్లో ఉంటూ వస్తున్నారు. దర్శన్ కేసుపై తన స్టైల్‌లో స్పందిస్తూ ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. ‘‘స్క్రీన్ ప్లే ఫైనల్ అయిన తర్వాతే ఫిల్మ్ మేకర్ అనేవాడు షూటింగ్ ప్రారంభిస్తాడు. కానీ చాలాసార్లు ఒకవైపు షూటింగ్ జరుగుతున్నా మరోవైపు రైటింగ్‌లో బిజీగా ఉంటారు. దర్శన్ మర్డర్ కేసులో సినిమా విడుదలయిన తర్వాత స్క్రీన్ ప్లే రాయడం మొదలయ్యింది’’ అంటూ ట్విటర్‌లో షేర్ చేశాడు ఆర్జీవీ. అంతే కాకుండా రేణుకా స్వామిని హత్య చేయించడం కోసం దర్శన్ తన ఫ్యాన్స్‌నే ఉపయోగించుకోవడంపై కూడా ఆయన స్పందించారు. హీరోలను దేవుళ్లుగా భావించడంపై ఆర్జీవీ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ‘‘ఒక స్టార్ హీరో తన పర్సనల్ లైఫ్‌లో జోక్యం చేసుకుంటున్న ఒక డై హార్డ్ ఫ్యాన్‌ను హత్య చేయడం కోసం మరో డై హార్డ్ ఫ్యాన్‌ను రంగంలోకి దించడం అనేది స్టార్లను దేవుళ్లుగా పూజించే వ్యాధికి మంచి ఉదాహరణ. అంతే కాకుండా స్టార్లే తమ జీవితాలు ఎలా సాగాలో నిర్ణయించాలి అనుకోవడం కూడా ఈ వ్యాధిలో భాగమే’’ అని తెలిపారు రామ్ గోపాల్ వర్మ.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola