Mega Chiranjeevi:ఫ్లైట్ లో అభిమానిని తీసుకొచ్చిన చిరంజీవి
అభిమానులు ఆరాధిస్తారు. చిరంజీవి వారిని ప్రేమిస్తారు. మెగాస్టార్ ను ఓ సారి కలవాలని ఉంది అని ట్విట్టర్ వేదికగా కోరిన ఓ అభిమాని కోరికను చిరంజీవి స్వయంగా తీర్చారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వెంకట్, ఆయన భార్య సుజాతకు మెగాస్టార్ ఫ్లైట్ టికెట్లు బుక్ చేయించి మరీ హైదరాబాద్ తీసుకొచ్చారు. వెంకట్ ఆరోగ్యంపై ఆరా తీశారు. దాదాపు 45 నిమిషాలు మాట్లాడిన అనంతరం హైదరాబాద్ ఒమేగా ఆసుపత్రిలో చెకప్ కోసం పంపించారు. వైద్యులతో స్వయంగా మాట్లాడి పరిస్థితిని ఆరా తీసిన చిరంజీవి వెంకట్ సొంత ప్రాంతం విశాఖలో వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఖర్చు మొత్తం తాను భరిస్తానని తన అభిమానిని కాపాడుకునేందుకు వెనకాడనని హామీ ఇచ్చారు. అవసరమైతే చెన్నై తీసుకెళ్తామన్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు చిరంజీవిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
Tags :
Chennai VIZAG ChiranjeeviTrust VisakhaFan ChiruMadeFanHappy MegastarGoodHeart ProudMegaFans Mega Chiranjeevi