తండ్రి ఆరోపణలపై మంచు మనోజ్ ఫైర్
మంచు మనోజ్, మోహన్ బాబు ఒకరిపై ఒకరు కంప్లెయింట్ ఇవ్వడం సంచలనమైంది. కొద్ది కాలంగా కుటుంబంలో ఆస్తి గొడవలు జరుగుతున్నాయన్న ప్రచారం నడుస్తోంది. ఇప్పుడు మొత్తానికి ఇద్దరూ రచ్చకెక్కడం వల్ల ఆ విషయం కన్‌ఫమ్ అయింది. అయితే...తండ్రి మోహన్ బాబు కంప్లెయింట్‌పై మంచు మనోజ్ హర్ట్ అయ్యాడు. తండ్రి ఆరోపణలపై మంచు మనోజ్ స్పందించాడు. తనతో పాటు తన భార్యపైనా అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండి పడ్డాడు. ఈ వ్యవహారంలో తనకు అండగా నిలబడాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్‌నీ కోరారు. కుటుంబ ఆస్తుల కోసం ఎప్పుడూ తాను ఆశపడలేదని, విద్యా సంస్థల్లో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఆ బాధితులకు అండగా ఎప్పుడూ ఉంటానని తెలిపారు. విష్ణు అనుచరులే సిసి ఫుటేజ్ మొత్తాన్ని మాయం చేశారని, ఇంటిలో ఉన్న సీసీ కెమెరాలు అన్నిటిని తీసుకెళ్లిపోయారని మంచు మనోజ్ ఆరోపించారు. కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతిసారి ప్రయత్నం చేశానని, కానీ...ఈ వివాదాల్లో తన కూతుర్ని కూడా లాగడం బాధాకరమని అసహనం వ్యక్తం చేశాడు మనోజ్. ఈ మేరకు ట్విటర్‌లో ప్రెస్ నోట్ విడుదల చేశాడు.