Mahesh babu with Nagarjuna : మల్టీస్టారర్ కు సిద్ధమంటున్న మహేష్- నాగర్జున | ABP Desam

టాలీవుడ్ లో మల్టీస్టార్లర హవా నడుస్తోంది. కింగ్ నాగర్జున, సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇద్దరూ మల్టీస్టారర్ మూవీస్ చేశారు. సూపర్ హిట్ లు అందుకున్నారు. మరి, వీరిద్దరూ కలిసి ఒకే చిత్రంలో నటిస్తే.. ఎలా ఉంటుంది. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో దీనిపై చర్చ నడుస్తోంది. ఎందుకంటే.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగర్జున నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం The Ghost ట్రైలర్ విడుదల చేశారు.. మహేశ్ బాబు. ట్రైలర్ రిలీజ్ చేసినందుకుగానూ... నాగర్జున థ్యాంక్స్ చెబుతూ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. ‘‘హే.. మహేశ్‌!! 29 ఏళ్ల క్రితం ‘వారసుడు’ సినిమాలో నాతో కలిసి మీ నాన్న సూపర్‌స్టార్‌ కృష్ణగారు కలిసి నటించినప్పుడు చాలా ఆనందించా. మనం ఎందుకు చేయకూడదు?’’ అంటూ మహేశ్‌ని అడిగారు. వెంటనే మహేశ్ కూడా స్పందించారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola