Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABP
పెళ్లి జరిగి వారం రోజులు కూడా అయ్యిందో లేదో సినిమా ప్రమోషన్స్ లో బిజీ అయిపోయారు కీర్తి సురేశ్. తను హీరోయిన్ గా...వరుణ్ ధవన్ హీరోగా నటించిన బేబీ జాన్ సినిమా ప్రమోషన్స్ లో సందడి చేస్తున్నారు కీర్తి సురేశ్. అట్లీ డైరెక్షన్ లో ఈనెల 25న క్రిస్మస్ సందర్భంగా బేబీ జాన్ సినిమా రిలీజ్ అవుతోంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ముంబైలో క్రిస్మస్ బాష్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కు కీర్తి సురేశ్ హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు. పెళ్లైన వారం రోజులకే కీర్తి సినిమా మీద తన కమిట్మెంట్ ఏంటో చూపిస్తే...కీర్తి పెళ్లి తర్వాత కనిపిస్తున్న విధానం అందరి ప్రశంసలను అందుకుంటోంది. సినిమా అవసరాలకు తగినట్లుగా గ్లామర్ గా కనిపించేలా ఫ్యాషన్ దుస్తుల్లో మెరుస్తూనే...తన పెళ్లికి గుర్తుగా తాళిబొట్టుతో కీర్తి కనిపించటం బాలీవుడ్ జనాన్ని షాక్ కి గురిచేస్తోంది. పెళ్లైన తర్వాత పనిచేసే ఏ బాలీవుడ్ హీరోయిన్ తమ తాళిబొట్లను కనపడనివ్వకపోవటమే ఈ ఆశ్చర్యానికి కారణం. ఆ రకంగా కీర్తి సురేశ్ తన ట్రెడీషన్ ను ఫాలో అవుతూనే ఫ్యాషన్ గానూ ఉంటూ తన వృత్తికి న్యాయం చేయటానికి ట్రై చేస్తున్నారు.