Jr NTR Udupi Sri Krishna Temple Visit | తల్లి షాలినీకి ఉడుపి శ్రీకృష్ణుడి దర్శనం చేయించిన తారక్

 జూనియర్ ఎన్టీఆర్ తల్లి షాలినీ ఎప్పటి నుంచో అనుకుంటున్నారట ఉడుపి శ్రీకృష్ణుడిని దర్శించుకోవాలని..తన సొంత ఊరు కర్ణాటకలోని కుందాపుర్ కూ వెళ్లాలని. అమ్మ పుట్టినరోజుకు ఒక్క రోజు ముందు ఎన్టీఆర్ ఆ కోరికలను తీర్చాడు. తన తల్లిని, భార్యను వెంటబెట్టుకుని కుందాపుర్ కు వెళ్లాడు తారక్. కన్నడ స్టార్ హీరో, నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు గెల్చుకున్న రిషభ్ శెట్టి ఎన్టీఆర్ కు ఘనంగా స్వాగతం పలికి ఆయన ఆలయ దర్శన ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్నాడు. తారక్ తో పాటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఫ్యామిలీ కూడా ఉడుపి దర్శనానికి వచ్చింది. ఎన్టీఆర్, రిషభ్ శెట్టి, ప్రశాంత్ నీల్ ముగ్గురూ ఆలయంలోనే భోజనం కూడా చేశారు. అమ్మ కోరిక తీర్చటం చాలా ఆనందంగా ఉందన్న ఎన్టీఆర్ కు హోంబలే ఫిలింస్ అధినేత విజయ్ కిరంగదూర్ కు థాంక్స్ చెప్పారు. రిషభ్ శెట్టిని తనకు గాడ్ గిఫ్టెగ్ బ్రదర్ అని సంబోధించిన తారక్...దర్శనం తర్వాత ఉడుపి పీఠాధిపతులను కూడా కలుసుకున్నారు. పీఠాధిపతులు తారక్ కు శ్రీకృష్ణుడి హారం బహుకరించి శాలువాతో సన్మానించారు. ఆ తర్వాత కుందాపూర్ లో తారక్ పర్యటించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ రవిబ్రసూర్ స్టూడియోకు కూడా ఎన్టీఆర్ వెళ్లారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola