అభిమాని చివరి కోరిక తీర్చనున్న జూనియర్ ఎన్‌టీఆర్, దేవర సినిమా స్పెషల్ షో

బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధ పడుతున్న తన అభిమాని చివరి కోరిక తీర్చనున్నాడు జూనియర్ ఎన్‌టీఆర్. చనిపోయేలోగా దేవర సినిమా చూడాలని కోరుకున్నాడు. ఈ విషయం ఎన్‌టీఆర్ వరకూ వెళ్లింది. వెంటనే ఈ ఫ్యాన్‌ కోసం స్పెషల్ షో వేస్తానని మాట ఇచ్చాడు. ఏపీకి చెందిన కౌశిక్ కొద్ది రోజులుగా బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. తనకు ఎంతో ఇష్టమైన హీరో జూనియర్ ఎన్టీఆర్ సినిమా 'దేవర' చూడాలని తన బిడ్డ కోరుకుంటున్నాడని, అప్పటివరకూ అతన్ని బతికించాలని వైద్యులను వేడుకుంటున్నట్లు కౌశిక్ తల్లిదండ్రులు తెలిపారు. కాగా, యువకుడి తండ్రి శ్రీనివాసులు టీటీడీలో కాంట్రాక్ట్ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం బెంగుళూరులోని కిడ్‌వై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కౌశిక్ ఇష్యూ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. తన కొడుకుని ఎలాగైనా బతికించాలని తల్లి వేడుకుంటోంది. చిన్నప్పటి నుంచి తన కొడుకు జూనియర్ ఎన్‌టీఆర్ అభిమాని అని, చావు బతుకుల్లో ఉన్నా సినిమా గురించే కలవరిస్తున్నాడని కన్నీళ్లు పెట్టుకుంది. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola