Jr NTR Jaggannapeta Temple | కోనసీమలో ఎన్టీఆర్ కట్టించిన గుడి ఇదే | ABP Desam

కోనసీమ లోని జగ్గన్న పేట లో భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి గుడి పునర్నిర్మాణం కోసం Jr ఎన్టీఆర్ 12.50 లక్షల భారీ విరాళం ఇచ్చారు. అయితే ఈ విషయాన్ని ఆ ఊరి గ్రామస్తులు గుడి లో ఎన్టీఆర్  కుటుంబం పేరుతో శిలా ఫలకం ఏర్పాటు చేసే వరకూ ఎవరికీ తెలియలేదు. ఓటు వేయడానికి సొంత ఊరికి వచ్చిన కొందరు యువకులు ఆ శిలాఫలకాన్ని ఫోటో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా ఈ విషయం వైరల్ గా మారింది. Jr ఎన్టీఆర్ పెళ్లి చేసిన పురోహితుడు కారుపాటి కోటేశ్వర రావు అదే గ్రామానికి చెందిన వాడు. 90 ఏళ్ల క్రితం నాటి వీరభద్ర స్వామి ఆలయం పాడుబడ్డం తో ఆయన కోరిక మేరకు Jr ఎన్టీఆర్ భారీ విరాళాన్ని ఇచ్చారు. దానితో గుడి పునర్నిర్మాణం వేగంగా జరిగింది .ఇక ఈ గుడి కి నందమూరి హరికృష్ణ వచ్చేవారని గ్రామస్తులు తెలిపారు. Jr ఎన్టీఆర్ తల్లి షాలిని , సోదరుడు కళ్యాణ్ రామ్ రహస్యంగా వచ్చి ఈ గుడి నీ దర్శించి వెళుతుంటారని చెప్పిన ఆలయ ధర్మకర్త భవరాజు త్వరలోనే Jr ఎన్టీఆర్ ను కూడా గుడి కి ఆహ్వానిస్తామని చెబుతున్నారు .

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola