Jr NTR Fires on Photographer | ఫొటోగ్రాఫర్లపై ఎన్టీఆర్ ఆగ్రహం | ABP Desam
ఎప్పుడూ కూల్‌గా ఉండే జూనియర్ ఎన్టీఆర్‌కు కోపం వచ్చింది. బాలీవుడ్ ఫొటోగ్రాఫర్లపై ఆయన కోప్పడ్డాడు. దానికి రీజన్ ఏంటి అనుకుంటున్నారా? జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి ‘వార్ 2’ సినిమాలో యాక్ట్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ లుక్ లీక్ అవ్వకుండా ఎప్పుడూ క్యాప్‌తో కనిపిస్తున్నారు. కానీ ఆయన క్యాప్ లేకుండా ఉన్నప్పుడు కొంతమంది ఫొటోగ్రాఫర్లు ఆయనను వీడియోలు తీసే ప్రయత్నం చేశారు. దీంతో జూనియర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఓయ్... కెమెరాలు వెనక్కి పెట్టండి.’ అని కొంచెం గట్టిగా చెప్పారు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.