Devara Pre Release Cancel | ప్రీ రిలీజ్ ఎందుకు రద్దు చేశామో చెప్పిన శ్రేయాస్ మీడియా | ABP Desam

Continues below advertisement

ఎన్టీఆర్ దేవర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ అనుకోని పరిస్థితుల్లో రద్దు అయిన సంగతి తెలిసిందే. నిజానికి ఎంతో గ్రాండ్‌గా ఈ ఈవెంట్ జరగాల్సి ఉంది. అంతా రెడీ అయిన తర్వాత.. లాస్ట్ మినిట్లో ప్రొగ్రామ్ ని రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. నందమూరి అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎదురు చూశారు. కానీ వాళ్లు ఊహించని లెవల్ లో ఫ్యాన్స్ ఈవెంట్ కు వచ్చారు. నోవాటెల్ లో కేవలం 5 వేల మంది పట్టేంత హాలులో ప్రీ రిలీజ ఈవెంట్ ఏర్పాట్లు చేయగా.. అదే సమయానికి 35 వేలకు పైగా ఫ్యాన్స్ వచ్చారు. ఇక మరోదారి లేక ఈవెంట్‌ను క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఈవెంట్ మేనేజ్‌‌మెంట్ సంస్థ శ్రేయాస్ మీడియాపై విమర్శలు వచ్చాయి. దీనిపై ఆ సంస్థ క్లారిటీ కూడా ఇచ్చింది. అవుట్‌డోర్ లో ఈవెంట్ ప్లాన్ చేయకపోవడానికి రెండు రీజన్స్ ఉన్నాయని సంస్థ వివరణ ఇచ్చింది. గణేష్ నిమజ్జన వేడుకల టైంలోనే ఈవెంట్ ఉండడం వల్ల.. సిటీలో నిమజ్జనానికి పెద్ద స్థాయిలో పోలీసుల అవసరం ఉంటుంది. ఇంకా భారీ వర్షం పడే అవకాశం ఉన్న కారణంగా అవుట్ డోర్‌లో ఈవెంట్ నిర్వహించలేదని ఎక్స్‌ప్లనేష్ ఇచ్చింది. నోవోటెల్‌లో హాల్ 3 నుంచి 6 వరకు బుక్ చేస్తే.. దాని కెపాసిటీ 5500 మంది వరకు ఉంటుందని చెప్పింది. కానీ, జనాలు 35 వేలకు పైగా రావడం వల్ల.. ఆ క్రౌడ్ మేనేజ మెంట్ కష్టం అయిపోయి.. గతిలేని పరిస్థితిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని క్యాన్సిల్ చేశామని శ్రేయాస్ మీడియా క్లారిటీ ఇచ్చింది. ఇలా జరిగినందుకు క్షమాపణలు కూడా కోరింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram