Devara Part 1 Trailer Reaction | ధైర్యాన్ని చంపేసే భయం..దేవరగా తారక్ ప్రభంజనం | ABP Desam

మొత్తానికి తారక్ ఫ్యాన్స్ ఆరేళ్లుగా ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. RRR సంగతి పక్కన పెడితే నందమూరి తారకరాముడి సోలో రిలీజ్ కోసం వేయి కళ్లతో వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి ఈరోజు రిలీజైన దేవర ట్రైలర్ మాస్ పూనకాలు తెప్పించటం పక్కా. ఆచార్య లాంటి ఫ్లాప్ సినిమాతో జీవితానికి సరిపడా ఆకలితో ఉన్న కొరటాల శివ కసి దేవర ట్రైలర్ లో స్పష్టంగా కనిపించింది. సముద్రం దాని మీద ఆధారపడిన జనం..వాళ్లను దోచుకునే మూకలు..మూకల ధైర్యాన్ని అణిచేసే భయంగా దేవర..ఇలా లైన్ మొత్తాన్ని ట్రైలర్ లోనే రివీల్ చేసేశారు. అంతే కాదు ధైర్యాన్ని భయపెట్టి చంపేసే కాలరుద్రుడి లాంటి దేవరకు పూర్తి స్థాయి అపోజిట్ రోల్ లో ఆయన కొడుకుగా కూడా తారకే కనిపించనున్నాడని అర్థమవుతోంది. కొడుకు పాత్రలో చేసిన తారక్ కు లవ్ ఇంట్రెస్ట్ గా జాన్వీ కపూర్ కనిపించింది. భైరా గెటప్ లో సైఫ్ అలీఖాన్ నెగటివ్ షేడ్స్ లో కనిపిస్తున్నాడు. దేవరకు చెక్ పెట్టడానికి ఆయన కొడుకునే దింపే ఆలోచనలను కూడా ట్రైలర్ లోనే రివీల్ చేసేశారు. మరి రెండేళ్ల క్రితం సముద్రం ఎక్కిన దేవర తిరిగి ఎందుకు రాలేదు...ఆయన కొడుకు ఎన్టీఆర్ వెతుక్కుంటూ వెళ్లాడా వేసేయడానికి వెళ్లాడా సినిమాలో చూడాల్సిందే. ఇక ట్రైలర్ ఆఖరి షాట్ అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసమే ప్రత్యేకం. అప్పుడెప్పుడో ఛత్రపతి లో ప్రభాస్ తిమింగలం ఫైట్ చూశాం. ఇక్కడ ఏకంగా కొరడాతో తిమింగలాన్ని స్వారీ చేస్తున్నట్లు ఎన్టీఆర్ ను చూపించారు. మాస్ ఫీస్ట్ అసలు. ఈ ట్రైలర్ అంతా చూశాక ఆంధ్రావాలా సినిమా తండ్రీ కొడుకుల ఎపిసోడ్ గుర్తొచ్చినా తప్పులేదు..కొంచెం ఆ వైబ్స్ కూడా ఉన్నాయ్ మరి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola