Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?

Continues below advertisement

తెలుగు బుల్లితెరపై నటిగా, సోషల్ మీడియా సెలబ్రిటీగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు జయ చిరవూరి. 'జాబిల్లి కోసం ఆకాశమల్లె' సీరియల్‌ ద్వారా నటిగా ఎంట్రీ ఇచ్చిన జయ, తన తొలి ప్రయత్నంలోనే కీలక పాత్రతో కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

భారత్‌లో పుట్టి పెరిగిన జయ, పెళ్లి తర్వాత US లో స్థిరపడ్డారు. కేవలం నటనకే పరిమితం కాకుండా, 'Jaya Chiravuri' పేరుతో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి ప్రముఖ కంటెంట్ క్రియేటర్‌గా మారారు. నటిగా, డిజిటల్ క్రియేటర్‌గా రాణిస్తున్న జయ, 'Jaya's Designer Studio' పేరుతో ఫ్యాషన్ రంగానికి సంబంధించి సొంత క్లాథింగ్ బిజినెస్ కూడా నడుపుతున్నారు. మోడ్రన్, ఎత్నిక్ డిజైనర్ అవుట్‌ఫిట్స్‌ను స్వయంగా ప్రమోట్ చేస్తూ ఫ్యాషన్ ఐకాన్‌గా గుర్తింపు పొందారు. 

యూట్యూబ్ మోనిటైజేషన్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, స్పాన్సర్డ్ రీల్స్ మరియు తన సొంత డిజైనర్ స్టూడియో బిజినెస్ ద్వారా బాగానే సంపాదిస్తున్నారు. అమెరికాలో ఉంటూనే డిజిటల్ ప్రపంచంలో విజయం సాధించి, ఇప్పుడు తెలుగు సీరియల్స్ ద్వారా నటిగా తన డ్రీమ్‌ను నెరవేర్చుకుంటున్న జయ చిరవూరి, నెటిజన్లకు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola