Introducing Bujji | Kalki 2898 AD లో Prabhas దోస్త్ బుజ్జి పరిచయం | ABP Desam
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబుజ్జి నా జీవితంలోకి వస్తోంది అంటూ కొద్ది రోజుల క్రితం ప్రభాస్ పెట్టిన సోషల్ మీడియా పోస్టులు దీని కోసమే. ఇంతకీ అసలు బుజ్జి వచ్చేసింది. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి హేమాహేమీలతో కలిసి ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898AD నుంచి బుజ్జి అనే చిట్టి రోబో క్యారెక్టర్ ను పరిచయం చేశారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. బుజ్జి బ్రెయిన్ చిన్న రోబో లా ఉంటే బుజ్జి బాడీ మాత్రం ఓ సూపర్ కార్. అదేదో సరికొత్త ప్రపంచంలో నిలువెత్తు ఆకారాలు, భారీ విగ్రహాల మధ్య సూపర్ కార్ ను రైడ్ చేస్తున్న ప్రభాస్ టీజర్ ను రిలీజ్ చేసింది టీమ్. ఎప్పుడూ నెగటివ్ గా మాట్లాడే బుజ్జి ని తన కోసం ఒక్కరోజైనా పని చేయమని ప్రభాస్ పోషించిన భైరవ క్యారెక్టర్ విసుక్కుంటున్నట్లుగా బుజ్జి క్యారెక్టర్ ను పరిచయం చేశారు. చివరికి ఏదో ఆపద నుంచి భైరవను కాపాడుతుంది అనుకుంటా ఐలవ్ యూ బుజ్జి అంటూ టీజర్ ఎండ్ చేశారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం అంటూ అన్ని భాషలు మాట్లాడేస్తోంది ఈ బుజ్జి. ఈ బుజ్జి అనౌన్స్మెంట్ కోసం నిర్వహించిన ఈవెంట్ లో ప్రభాసే బుజ్జిసూపర్ కార్ ను నడుపుతూ వచ్చి ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరిచారు. ఈ సినిమాతో నాగ్ అశ్విన్ హాలీవుడ్ రేంజ్ కి ఇండియన్ సినిమాను తీసుకెళ్తారని కాన్ఫిడెన్స్ వ్యక్తం చేసిన ప్రభాస్. జూన్ 17న ప్రేక్షకుల ముందుకు కల్కిని తీసుకువస్తున్నట్లు ప్రకటించారు.