Hit 3 Crazy Combo : హిట్ 2 రిలీజ్ కు ముందే హిట్ 3 పై అంచనాలు | ABP Desam
ఇప్పుడంతా సినిమాటిక్ యూనివర్స్ ట్రెండ్ నడుస్తోంది. లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ LCU ను డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ క్రియేట్ చేసి అందులో విక్రమ్, ఖైదీ, ఇప్పుడు రాబోతున్న విజయ్ సినిమాను క్రాస్ ఓవర్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. అలానే మరో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా సినిమాటిక్ యూనివర్స్ లోనే సినిమాలు తీయనున్నట్లు అర్థమవుతోంది. కేజీఎఫ్, సలార్, ఎన్టీఆర్ 31 ఇవ్వన్నీ సేమ్ సినిమాటిక్ యూనివర్స్ సినిమాలు. ఇప్పుడు క్రైం థ్రిల్లర్ జోన్రాలో సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసే బాధ్యతను డైరెక్టర్ శైలేష్ కొలను తీసుకున్నారు.