ప్రభాస్ లాంటి హీరో ఒక్కడే ఉంటారు: హీరోయిన్ మాళవిక మోహన్

Continues below advertisement

ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ 2025 లో హీరోయిన్ మాళవికా మోహనన్ పాల్గొని మాట్లాడారు. ప్రభాస్ తో రాజాసాబ్ సినిమా చేయంటపై, తెలుగులో తొలిసారిగా అడుగుపెట్టడంపై మాట్లాడిన మాళవికా...హీరోయిన్లకు తక్కువ పనిగంటల విధానంపైనా కూడా సదస్సులో చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభాస్ రాజాసాబ్ సినిమాతో తెలుగులో ఎంటర్ అవుతున్నాన్నారు. ‘ప్రభాస్ లాంటి స్టార్ ఒకే ఒక్కడుంటాడు. ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ సినిమా అంటే నాకు ఒకటో రెండో పాటలు ఇస్తారు.. 4-5 సీన్లు ఇస్తారనుకున్నా. కానీ ఓ మంచి పాత్ర నాకు రాజాసాబ్ లో దక్కింది. ఆ సినిమాతో తెలుగు డెబ్యూ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడెప్పుడు సినిమా విడుదల అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’ అన్నారు హీరోయిన్ మాళవికా మోహనన్. 
అంతేకాకుండా.. ‘సినిమా ఫీల్డ్‌లోనే పెరిగాను. మా నాన్నగారు ఎంత కష్టపడేవారో చూసేదాన్ని. ఆయన ఏదైనా కొత్త సినిమా ఒప్పుకుంటే ఓ 5 నెలలు మనకు కనపడరని మా అమ్మ ముందుగానే నన్ను మెంటల్ గా ప్రిపేర్ చేసేది. ఎందుకంటే ఆయన అప్పట్లో 12 గంటలు కష్టపడేవారు. షూటింగ్ మొదలు కావటానికి గంటా, రెండు గంటల ముందే వెళ్లిపోయేవారు. అంతా చేసి ఆ బొంబాయి ట్రాఫిక్ లో ఈదుకుంటూ ఇంటికి రావాలి. మళ్లీ రేపటి షూటింగ్ కి సిద్ధం కావాలి. ఇంక పేరెంట్స్ అనే పదానికి అర్థం ఉండేది కాదు. 




 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola