Hero Vishal Fainted on Stage | స్టేజీపైనే కుప్పకూలిన హీరో విశాల్‌

కోలీవుడ్ స్టార్ విశాల్ అస్వస్థతకు గురయ్యారు. 'మిస్ కూవాగం 2025' ఈవెంట్ లో పాల్గొన్న ఆయన సడన్‌గా వేదికపైనే కుప్పకూలారు. దీంతో ఆ కార్యక్రమానికి వచ్చిన అతిథులు, ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. ఆయనకు ప్రథమ చికిత్స అందించి స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించగా కాస్త కోలుకున్నారు. అక్కడే ఉన్న మాజీ మంత్రి పొన్ముడి, ఈవెంట్ నిర్వాహకులు ఆయన్ను స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. 

అయితే.. విశాల్‌కు ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. 'మద గజ రాజా' సినిమా ప్రమోషన్స్‌లో ఆయన చాలా నీరసంగా వణుకుతూ కనిపించారు. అప్పుడే ఆయన ఆరోగ్యంపై పలు రూమర్లు హల్చల్ చేశాయి. ఈ రూమర్లను కొట్టి పారేసిన ఆయన టీం.. విశాల్ తీవ్ర జ్వరంతో బాధ పడుతున్నారని అప్పట్లో క్లారిటీ ఇచ్చింది.

ప్రస్తుతం విశాల్ పూర్తి ఆరోగ్యంతోనే ఉన్నారని ఆయన టీం స్పష్టం చేసింది. ఆదివారం మధ్యాహ్నం ఆయన ఆహారం తీసుకోలేదని.. జ్యూస్ మాత్రమే తాగారని.. అందుకే స్పృహ కోల్పోయినట్లు మేనేజర్ హరి తెలిపారు. టైంకు ఫుడ్ తీసుకోవాలని డాక్టర్స్ సూచించినట్లు చెప్పారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola