Hero Varun Sandesh on Nindha Pre release | నింద ప్రీరిలీజ్ లో వరుణ్ సందేశ్ ఎమోషనల్ స్పీచ్ |ABP Desam

Continues below advertisement

 కాండ్రకోట మిస్టరీ ప్రధానాంశంగా వరుణ్ సందేశ్ హీరోగా వస్తున్న సినిమా 'నింద'. ఈ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ లో వరుణ్ సందేశ్ తన కెరీర్ లో వచ్చిన ఎత్తు పల్లాలపై ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు.కెరీర్ మొదట్లోనే హీరోగా బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకున్నాడు వరుణ్ సందేశ్. తర్వాత ఎన్నో ఫ్లాప్స్‌ను చూసి చాలాకాలం సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నాడు. ఇక ఇన్నాళ్లకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయ్యాడు. జూన్ 21న వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ‘నింద’ మూవీ విడుదలకు సిద్ధమయ్యింది. తాజాగా మూవీ టీమ్ ఒక ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. దీనికి హీరో నిఖిల్.. చీఫ్ గెస్ట్‌గా వచ్చాడు. ఈ ఈవెంట్‌లో వరుణ్ భార్య వితికా షేరు కూడా పాల్గొంది. ఇద్దరూ కలిసి తమ పర్సనల్ లైఫ్‌లోని కొన్ని సరదా విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. వరుణ్ సందేశ్, వితికా షేరు కలిసి ‘నింద’ ఈవెంట్‌లో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేశారు. పర్సనల్ లైఫ్‌లో నిందల గురించి మాట్లాడుతూ.. ‘‘మా అత్తయ్య వాళ్లు అమెరికాలో ఉంటారు కాబట్టి వాళ్లు ఫోన్ చేసిన ప్రతీసారి వితికా వంట చేయడం లేదని చెప్తుంటాడు. మొన్న ఒక వీడియోలో కూడా అదే చెప్పాడు. గత ఏడేళ్ల నుంచి ఆ నిందలు పడుతూనే ఉన్నాను’’ అని వితికా చెప్పింది. దీనికి వరుణ్ కూడా సమాధానమిచ్చాడు. ‘‘వితికాకు ఎప్పుడైనా బోర్ కొడితే మా అమ్మా, నాన్నకు ఫోన్ చేసి సందేశ్ తిట్టాడని చెప్తుంది. వాళ్లు ఫోన్ చేసి నన్ను తిడితే తనకొక ఆనందం’’ అని తమ మధ్య జరిగే సరదా విషయాన్ని బయటపెట్టాడు వరుణ్ సందేశ్.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram