బ్రెస్ట్ క్యాన్సర్ తో పోరాడి గెలుస్తానని చెప్పిన బ్యూటీ.
Continues below advertisement
టాలీవుడ్ లో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ఐటెం గర్ల్ గా పలు సినిమాల్లో నటించిన హంసానందిని నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.తను క్యాన్సర్ తో పోరాడుతున్నానని చెప్పి షాకిచ్చింది హంసానందిని. అంతేకాదు.. కీమోథెరపీ కారణంగా జుట్టు మొత్తం కోల్పోయి గుండుతో కనిపించింది.నాలుగు నెలల క్రితం తన బ్రెస్ట్ లో లంప్ ఉన్నట్లుగా గుర్తించిన హంసానందిని వెంటనే డాక్టర్స్ ని కలిసి పలు టెస్ట్ లు చేయించుకుంది. అందులో తనకు బ్రెస్ట్ క్యాన్సర్ అని తేలిందట. కొన్నేళ్లక్రితం తన తల్లి కూడా క్యాన్సర్ తో చనిపోయిందని.. అప్పటిరోజులు గుర్తుచేసుకుంటే ఇప్పటికీ ఎంతో బాధగా ఉంటుందని.. ఇప్పుడు తనకు కూడా క్యాన్సర్ వచ్చిందని ఎమోషనల్ అయింది హంసానందిని.
Continues below advertisement