Gamanam Movie Team: మల్లారెడ్డి మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో సందడి చేసిన గమనం చిత్రబృందం
మైసమ్మగూడలోని మల్లారెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో గమనం చిత్రబృందం సందడి చేసింది. శ్రియా, ప్రియాంక జవాల్కర్, శివకందుకూరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఈనెల 10న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా...ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న చిత్రబృందం...మల్లారెడ్డి కళాశాలలో విద్యార్థులను కలిసి మాట్లాడింది. పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు పరిపూర్ణమైన జీవన ప్రయాణం గురించి చెప్పే సినిమానే గమనం అని ఈ చిత్రంగా దర్శకురాలిగా అరంగ్రేటం చేస్తున్న సుజనా రావు తెలిపారు.ప్రియాంక జవాల్కర్, శివ కందుకూరి విద్యార్థులతో సరదాగా గడిపారు.