Film Workers Body Letter: గాడ్సేని హీరోలా చూపిస్తున్న సినిమాను ఆపాలంటూ ప్రధానికి లేఖ| ABP Desam
గాడ్సేని హీరోలా చూపిస్తున్న వై ఐ కిల్డ్ గాంధీ సినిమాను విడుదల కాకుండా ఆపాలంటూ సినీకార్మికుల సంఘం కేంద్రానికి లేఖ రాసింది. ప్రధాని మోదీని కోట్ చేస్తూ లేఖ రాసిన కార్మికుల సంఘం..గాడ్సే ని హీరోలా చూపించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్సీపీ కి చెందిన ఎంపీ అమోల్ కోల్హే గాడ్సే పాత్రను పోషించటంపై ఆయనపైనా విమర్శలు ఎక్కువవుతున్నాయి. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి జాతిపితను అవమానించేలా సినిమాలో హీరోగా నటించపై ఆందోళన వ్యక్తం చేసింది కాంగ్రెస్. తక్షణం ఈ సినిమాను ఆపాలంటూ డిమాండ్ చేసింది.