పవన్ కల్యాణ్ సినిమాల్లో సుజిత్ కు ఏ సినిమా ఇష్టం..| Abpdesam

భజే వాయు వేగంతో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న కార్తీకేయతో OG డైరెక్టర్ సుజిత్ స్పెషల్ ఇంటర్వ్యూ. పవన్ గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో ఉన్నాయి. మీరు చూసేయండి..! క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చే సినిమాలు చాలావరకు ప్రేక్షకులను ఇంప్రెస్ చేసేలా ఉంటాయి. ఇంకా ఆ క్రైమ్‌లో ఎమోషన్ యాడ్ చేస్తే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నాడు యంగ్ హీరో కార్తికేయ. కార్తికేయ హీరోగా ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమానే ‘భజే వాయు వేగం’. ఈ సినిమా షూటింగ్‌ను సైలెంట్‌గా పూర్తిచేసి అప్పుడే విడుదలకు కూడా సిద్ధం చేశారు మేకర్స్. మే 31న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవ్వడంతో తాజాగా దీని ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఒక క్రైమ్ చుట్టూ తిరుగుతూ ట్రైలర్ అంతా ఆసక్తికరంగా సాగింది. ‘‘హైదరాబాద్ మొత్తం అలర్ట్ చేశాం. ప్రతీ చెక్‌పోస్ట్ జాగ్రత్తగా చెక్ చేస్తాం’’ అని పోలీస్ వాయిస్ ఓవర్‌తో ‘భజే వాయు వేగం’ ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఒక రౌడీ పాత్రలో రవి శంకర్ ఎంట్రీ ఇస్తారు. ‘‘ఆ బ్యాగ్‌లో ఎంతుందో తెలుసా’’ అని అడగగానే ఒక చోటిలో కోట్లలో డబ్బు కనిపిస్తుంది. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola