Shyam Benegal Passed Away | ఏడుసార్లు జాతీయ అవార్డు పొందిన దర్శకుడి అస్తమయం | ABP Desam

Continues below advertisement

  దిగ్గజ దర్శకుడు శ్యామ్ బెనగల్ కన్నుమూశారు. ఆయన వయస్సు 90 సంవత్సరాలు. 1934 డిసెంబర్ 14న అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని తిరుమలగిరిలో జన్మించిన శ్యామ్ బెనగల్...ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ ఎకనామిక్స్ చేశారు. ఆయన తల్లితండ్రులు కర్ణాటక నుంచి హైదరాబాద్ కు వచ్చి సెటిల్ అయ్యారు. అక్కడే హైదరాబాద్ ఫిలిం సొసైటీని స్థాపించారు. ఇండియన్ ప్యారలల్ సినిమాకు టార్చ్ బేరర్ గా పేరు తెచ్చుకున్న  శ్యామ్ బెనగల్ తన కెరీర్ లో మొత్తం ఏడుసార్లు జాతీయ అవార్డులను అందుకున్నారు. 1974లో అంకుర్ సినిమాతో తన కెరీర్ ను ప్రారంభించిన శ్యామ్ బెనగల్...నిషాంత్, మంథన్, భూమిక, అనుగ్రహం, ఆరోహణ్ లాంటి క్లాసిక్స్ తీశారు. బెర్లిన్, లండన్ ఫిలిం ఫెస్టివల్స్ లో శ్యామ్ బెనగల్  సినిమాలు ప్రత్యేకంగా స్క్రీన్ అయ్యేవి.  2023 లో 89 ఏళ్ల వయస్సులో నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తో కలిసి ముజీబ్ అనే సినిమాను తీశారు ఆయన. జీవితపర్యాంతం సినిమాకే తన సేవలను అంకితం చేసిన శ్యామ్ బెనగల్ ను భారత ప్రభుత్వం 1976లో పద్మశ్రీ, 1991 పద్మభూషణ్ తో గౌరవించింది. సినీ పరిశ్రమలో అత్యుతున్నతమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును 2005లో శ్యామ్ బెనగల్ అందుకున్నారు. 2006-12 రాజ్యసభ ఎంపీగానూ సేవలందించారు శ్యామ్ బెనగల్.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram