Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు

Continues below advertisement

భారత చలనచిత్ర రంగానికి దశాబ్దాలుగా ఎన్నో సేవలు అందించిన బాలీవుడ్ హీ-మ్యాన్, లెజెండరీ యాక్టర్ ధర్మేంద్రకు కేంద్ర ప్రభుత్వం దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ తో గౌరవించింది. రాష్ట్రపతి భవన్‌లో వైభవంగా జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో గౌరవనీయులైన రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ధర్మేంద్ర భార్య నటి హేమా మాలిని పురస్కారాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తదితరులు హాజరయ్యారు. ధర్మేంద్రకు 2012లో పద్మభూషణ్ పురస్కారం లభించింది. 90 ఏళ్ల వయసులోనూ సినిమాల్లో నటించిన దిగ్గజ నటుడు.. 2025 నవంబర్ 24న కన్నుమూశారు. పద్మశ్రీ అవార్డులు అందుకున్న తెలుగువారిలో యూజీసీ మాజీ ఛైర్మన్ మామిడాల జగదీష్‌ కుమార్, హైదరాబాద్‌ ఏఐజీ హాస్పిటల్స్ డైరెక్టర్ డా. గూడూరు వెంకట్‌ రావు, ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారిణి దీపికారెడ్డి, అపోలో క్యాన్సర్‌సెంటర్‌ డైరెక్టర్‌ డా. పాలకొండ విజయానందరెడ్డి, ప్రొఫెసర్‌ వెంపటి కుటుంబశాస్త్రి ఉన్నారు. 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola