Breaking News| Adipurush| ఆదిపురుష్ టీజర్ అభ్యంతరాలపై.. ప్రభాస్ కు హైకోర్టు నోటీసులు | ABP Desam
Continues below advertisement
ఆదిపురుష్ సినిమా టీజర్ విడుదలైనప్పటి నుంచి ఏదో ఒక వివాదం నడుస్తునే ఉంది. ఇందులో సన్నివేశాలు తమ మనోభవాలు దెబ్బతీసేలా ఉన్నాయని చాలా మంది విమర్శిస్తున్నారు. తాజాగా... ఆదిపురుష్ సినిమా టీమ్ కు దిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ సినిమాలో హిందువుల మనోభవాలు గాయపరిచారని.. సినిమా విడుదలపై స్టే విధించాలని దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ విచారించిన కోర్టు.. హీరో ప్రభాస్ తో పాటు సినిమా యూనిట్ కు నోటీసులు జారీ చేసింది.
Continues below advertisement