Daaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

   NBK మాస్ డైరెక్టర్లతో కలిసి పనిచేస్తే వచ్చే కిక్కే వేరు. వాల్తేరు వీరయ్యతో చిరంజీవిని రెట్రో లుక్ తో ప్రజెంట్ చేసిన డైరెక్టర్ బాబీ కొల్లి ఇప్పుడు బాలయ్యతో తెరకెక్కిస్తున్న NBK 109 టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ టీజర్ చూస్తే బాలయ్యను కూడా 90స్ కు పట్టుకెళ్లిపోయాడు అనిపించకమానదు. టీజర్ లో అసలు బాలయ్య ఎవరో ఈ సినిమాలో అతని క్యారెక్టర్ ఏంటో ఇంట్రడక్షన్ ఇప్పించారు. ఈ కథ వెలుగులను పంచే దేవుడి కాదు..చీకటిని పంచే రాక్షసులది కాదు..అలా అలా అని రాక్షసులను ఆడించే రావణుడి కథ కూడా కాదు. ఈ కథ రాజ్యం లేని ఓ మహారాజు కథ అని చెప్పించారు. ఈ డైలాగ్స్ వస్తున్నప్పుడు షాట్స్ లో రవికిషన్, బాబీ డియోల్, నితిన్ మెహతాలను చూపించారు. అంటే వీళ్లందరినీ తలదన్నే వాడిలా బాలయ్య కనిపించనున్నాడనైతే అర్థమైంది. ఇంతకీ బాలయ్య ఎవరనేగా ఆయన్ను గుర్రంపై వచ్చే డాకు మహారాజ్ గా చూపించారు. అంటే దొంగలకే దొంగ అన్నమాట. డాకు మహారాజ్ టైటిల్ పడేప్పుడు రివీల్ చేసిన బాలయ్య లుక్ అయితే ఆయన నిప్పురవ్వ సినిమా టైమ్ లో ఉన్న రగ్డ్ లుక్ ను తలపించేలా ఉంది. సంక్రాంతి గా కానుకగా వస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ, త్రివిక్రమ్ భార్య లక్ష్మీ సౌజన్య నిర్మిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలో మాస్ రచ్చ పుట్టించటం అయితే ఖాయంగా కనిపిస్తోంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola