Cinema: థియేటర్లు నడిచింది నాలుగు నెలలే.. ఆకట్టుకున్నాయి నాలుగు సినిమాలే
థియేటర్ లో సినిమా చూస్తే వచ్చే మజానే వేరు. అలాంటి మజాను దూరం చేసి ఇంట్లో కూర్చోబెట్టింది కరోనా వైరస్. రెండేళ్ల పాటు థియేటర్ మొహం చూడనీయకుండా చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి ఓ నాలుగు నెలలు కాస్త గ్యాప్ ఇచ్చినట్టే ఇచ్చి మళ్లీ మహమ్మారి విరుచుకుపడింది. అప్పటికే థియేటర్ల కొన్ని సినిమాలు హంగామా చేశాయి. బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. క్రాక్ సినిమా ఇచ్చిన ఓపెనింగ్ తో చాలా మంది నిర్మాతలు తమ సినిమాలను థియేటర్లో విడుదల చేసేందుకు ఇంట్రస్ట్ చూపారు. ఉప్పెన, జాతిరత్నాలు, జాంబిరెడ్డి, నాంది, వకీల్ సాబ్ ఇవన్నీ ఆ లిస్ట్ లోనివే.