Vishwaksen Speech At GOG Trailer Launch | ఫ్యాన్స్‌కు స్పీచ్‌తో ఊపిచ్చిన మాస్ కా దాస్

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో విష్వక్సేన్ మాట్లాడారు. మే 31వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో విష్వక్సేన్ సరసన నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటించారు. చైతన్య కృష్ణ దర్శకత్వం వహించారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించారు.

'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'లో లంకల రత్న పాత్రలో విశ్వక్ సేన్ నటించారు. యువ నాయకుడు రత్న అంటే బలంగా రాయమని 'హైపర్' ఆదితో చెబుతాడు హీరో. ఆ తర్వాత అంజలి, నేహా శెట్టిలను చూపించారు. నేహాతో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకున్నట్టు చూపించారు. 
'నా ఊరిలో నాకేటి భయం' అనే రకం హీరో. అతడి మీద పోలీసులు ఎందుకు అరెస్ట్ వారెంట్ విడుదల చేశారు? 'ఈ సమస్య వాడు పొతే వాడితో పోద్ది' అని నాజర్, ఆ తర్వాత 'లేదంటే ఊరే పోద్ది' అని మరో నటుడు ఎందుకు చెప్పారు? అనేది సిల్వర్ స్క్రీన్ మీద చూడాలి. 'నేను నీలా చదువుకోలేదు. నాకు తెలిసిందల్లా ఒక్కటే... మన మీదికి ఎవడైనా వస్తే వాడి మీదికి పడిపోవడమే' అని చెప్పే మాటలో హీరో క్యారెక్టరైజేషన్ చెప్పారు దర్శకుడు కృష్ణచైతన్య. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola