Vijay Devarakonda Rashmika Wedding Photos | విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి ఫోటోలు ఇవే | ABP Desam

 రౌడీ బోయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు. ఇన్నాళ్లూ తమ లవ్ లైఫ్ ని అత్యంత సీక్రెట్ గా ఉంచిన ఈ ఇద్దరూ రాజస్థాన్ లో ని ఉదయ్ పూర్ కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్యలో సంప్రదాయ బద్ధంగా వివాహం చేసుకున్నారు. రెండు రోజులుగా ఉదయ్ పూర్ వివాహ వేడుకలు జరుగుతుండగా...అత్యంత గోప్యంగా వాటిని నిర్వహించారు. ఎలాంటి ఫోటోలు లీక్ కాకుండా జాగ్రత్తపడ్డారు. ఈ రోజు పెళ్లి వేడుకలు పూర్తైన తర్వాత విజయ్, రష్మిక ఇద్దరూ తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన ప్రాణ స్నేహితురాలే ఇక నుంచి తన భార్య అని విజయ్ తన పోస్ట్ లో రాశారు. తను లేకుండా తన రోజు సంపూర్తిగా ఉండదని...అలాంటి రష్మికకు తన జీవితంలోకి స్వాగతం పలుకుతున్నట్లు విజయ్ ఎమోషనల్ నోట్ రాస్తే..రష్మిక కూడా తన పోస్ట్ లో తన భర్త విజయ్ దేవరకొండ గురించి రాసుకున్నారు. జీవితంలో ప్రశాంతత ఎలా ఉంటుందో పరిచయం చేసి...తను కన్న కలలను నిజం చేసుకునేలా ప్రోత్సహించి...జీవితంలో ఏదైనా సాధించగలనన్న ప్రోత్సాహాన్ని నమ్మకాన్ని తనలో కలిగించిన విజయ్ ను భర్తగా జీవితంలోకి ఆహ్వానిస్తున్నట్లు రష్మిక తన పోస్ట్ లో కోట్ చేశారు. మొత్తంగా రౌడీ బోయ్, నేషనల్ క్రష్ దాదాపు ఎనిమిదేళ్ల తమ పరిచయాన్ని వివాహ బంధంగా మార్చుకున్నారు. 2018లో గీత గోవిందం సినిమాతో తొలిసారిగా వీరిద్దరూ కలిసి నటించగా తర్వాత డియర్ కామ్రేడ్ చిత్రంలో కలిసి యాక్ట్ చేశారు. ఇప్పుడు రాహుల్ సాంకృత్యాయన్ రణబలి సినిమాతో మళ్లీ కలిసి తెరమీద సందడి చేయనున్న తరుణంలో వీరిద్దరూ పెళ్లి చేసుకోవటం వారి అభిమానుల్లో సంతోషాన్ని నింపుతోంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola