
Vicky Kaushal Bollywood Super Star | Chhava తో కొత్త సూపర్ స్టార్ పుట్టాడా.? | ABP Desam
గడచిన పాతికేళ్లలో బాలీవుడ్ లో సూపర్ స్టార్లు గా ఎదిగింది కేవలం ఇద్దరే అంటే నమ్మ గలరా...! హృతిక్ రోషన్, రణబీర్ కపూర్ లు మాత్రమే ఆ స్థాయి అందుకున్నారు. ఈమధ్య కాలం లో చాలామంది హీరోలు, స్టార్లు హిందీ సినిమాలో ఎంట్రీ ఇచ్చినా సూపర్ స్టార్ రేంజ్ మాత్రం అందుకో లేక పోయారు. అయితే ప్రస్తుతం వరుస హిట్లు తో పాటు నటనా పరంగా కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ "విక్కీ కౌశల్ " బాలీవుడ్ నయా సూపర్ స్టార్ గా అవతరించాడు. చత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన "చావా " సినిమాలో విక్కీ నటనకు బాలీవుడ్ ఫిదా అయితే... మరాఠా ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు.
షారుఖ్, సల్మాన్, అమిర్ ఖాన్ లతో పాటు అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ లు 90ల నాటి సూపర్ స్టార్ లు. ఇప్పటికీ వీరిదే హవా. ఈ హీరోల పేరుమీద జరిగే బిజినెస్ ఇప్పటికీ హిందీ బాక్స్ ఆఫిస్ కు ప్రాణం. గడిచిన పాతికేళ్ళలో అంటే 2000 తర్వాత హీరో లుగా ఎంట్రీ ఇచ్చిన వారిలో ఇద్దరే ఆ రేంజ్ స్టార్ -డమ్ అందుకున్నారు. వాళ్ళే 2000 లో "కహోనా ప్యార్ హై" తో ఓవర్ నైట్ స్టార్ అయిన హృతిక్ రోషన్, 2007 లో "సావరియా" తో హీరో గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రణబీర్ కపూర్. వీళ్ళిద్దరి పేరు మీద బిజినెస్, యూత్ లో వీళ్ళకున్న ఫాలోయింగ్ నెక్స్ట్ లెవెల్. ఈ పాతి కేళ్ల లో ఎంతోమంది వారసులు, నటులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చినా వీళ్ళ రేంజ్ అందుకోలేక పోయారు. అమితాబ్ వారసుడు అభిషేక్ బచ్చన్ నుండి అమిర్ ఖాన్ తనయుడు జునైడ్ వరకూ ఇదే తంతు. వీరిలో కొందరికి నటులుగా పేరుపడ్డా భారీ సక్సెస్ లు దక్కలేదు. ఇక రణవీర్ సింగ్, షాహిద్ కపూర్ లాంటి వాళ్ళకు కంటిన్యూటీ సమస్య. పైపెచ్చు నెపోటీజం బాధ లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా ఏళ్ల తర్వాత బాలీవుడ్ సరిక్రొత్త సూపర్ స్టార్ గా "విక్కీ కౌశల్ " అవతరిస్తున్నాడు.