VARANASI Trailer Decoded | Mahesh Babu తో నీ ప్లానింగ్ అదిరింది జక్కన్నా SS Rajamouli | ABP Desam

Continues below advertisement

ఫ్యాన్స్ అంతా ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం ఇదే. SSMB  29 పేరుతో రాజమౌళి- మహేశ్ బాబు చేస్తున్న ప్రాజెక్ట్ కి వారణాసి అనే టైటిల్ అనౌన్స్ చేశారు. అంతటి ఆగలేదు అసలేంటీ వారణాసి అనే కథ తెలిసేలా ఓ కాన్సెప్ట్ వీడియోను రిలీజ్ చేశారు. అసలు ఈ వీడియోలో ఉన్నదేంటో చూద్దాం. 

ముందుగా వారణాసి సినిమా ఒక కాలంలో...అనేక టైమ్ లైన్స్ లో జరిగే సినిమా. అందుకే గ్లోబ్ ట్రాటర్ తో పాటు టైమ్ ట్రాటర్ అని వేశాడు. అంటే కాలంలో ప్రయాణించగలిగేవాడు..కాలంతో ప్రయాణించగలిగేవాడు అనుకోవచ్చు. సరే కాన్సెప్ట్ వీడియోలో స్టార్టింగ్ వారణాసి నగరం చూపించారు. సమయం..ఆ కాలం క్రీ.శ 512. మహర్షులు యజ్ఞయాగాదులు చేస్తూ హవిశ్సులు సమర్పిస్తుంటే అగ్నికీలల గాల్లోకి ఉవ్వెత్తున లేచాయి. అక్కడ నుంచి సీన్ కట్ అయి 2027 అంటే వచ్చే ఏడాదికి వెళ్లింది. భూమి దిశగా అంతరిక్షం నుంచి శాంభవి అనే పేరు గల ఓ భారీ ఉల్క నిప్పులు కక్కుతూ దూసుకువస్తోంది.  అందులోనుంచి ఓ చిన్న ఉల్కశకలం జారి అంటార్కిటికా లోని రాస్ ఐస్ బర్గ్ దగ్గర పడింది. ఇది మూడో విజువల్. అక్కడే కనిపించింది ఏంటంటే ఆ మంచు శిఖరాన్ని అధిరోహించటానికి కొంత మంది మనుషులు యత్నిస్తున్నారు కానీ దాని అడుగు భాగాన ఓ భారీ ఓడ ముక్కలు ముక్కలై చిక్కుకపోయి ఉంది. అక్కడి నుంచి కట్ చేస్తే ఆఫ్రికా కు కథ వెలళ్లింది అక్కడ ఆంబోస్ లీ వైల్డ్ పార్క్ లో అనేక జంతువులు వేగంగా పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. వెనుక భాగంలో ఎవరో పారా గ్లైడింగ్ చేస్తున్నారు. అక్కడ నుంచి కట్ చేస్తే భారీ నీటి ఏనుగులు దాడి చేస్తుంటే ఓ లాంగూర్ లాంటి జంతువు ఏదో పెద్ద తాడును పట్టుకునే యత్నం చేస్తోంది. అక్కడ నుంచి కట్ చేసి వనాంచల్ లోని ఉగ్రభట్టి గుహలను చూపించారు. అక్కడ కాళి దేవి విగ్రహం పైనుంచి ఓ మహిళ కిందకు పడుతూ చూపించారు. ఇక్కడి నుంచి ఎవరూ ఊహించని ట్విస్ట్. కథ ఈసారి ఏకంగా క్రీస్తు పూర్వం 7200 వ సంవత్సరానికి అంటే త్రేతా యుగానికి వెళ్లింది. అది లంకా నగరం...మహాశక్తి హనుమంతుడు అంత ఎత్తైన రూపంలో నిలబడి కదనరంగంలో దునుముతుుంటే రావణుడి ప్రాణాలు తెంచే శ్రీరామచంద్రుడి వానర మూకపై నిలబడి రామబాణాన్ని సంధిస్తున్నారు. కట్ టూ రామనాప జపంతో కథ మళ్లీ వారణాసిలో మణికర్ణిక ఘాట్ లోకి వచ్చింది. త్రిశూలం చేతబట్టి వృషభరాజంపై మహేశ్ బాబు నెత్తురోడుతూ లక్ష్యం వైపు దూసుకువెళ్తున్నాడు. ముందుకు దుముకుతున్న నంది గిట్టల రణధ్వని నుంచి వారణాసి టైటిల్ వేశారు. ఓ ఉల్క టైటిల్ ను ఢీకొట్టినట్లు కూడా చూపించారు. ఇది గ్లోబ్ ట్రాటర్ మాత్రమే కాదు టైమ్ ట్రాటర్ అని కూడా చూపించారు. ఇది ఒక్క చిన్న వీడియోలో ఇంతటి పెద్ద కథ చూపించి రాజమౌళి మహేశ్ తో చేస్తున్న సినిమా స్థాయి ఏంటో మొత్తం ప్రపంచం నివ్వెర పోయేలా చూపించారు. రాజమౌళి విజన్ కు...మహేశ్ నమ్మకానికి.. కీరవాణి రోమాలు నిక్కబొడుచుుకనే మ్యూజిక్ కి వారణాసి కాన్సెప్ట్ వీడియో జస్ట్ శాంపుల్ అంతే. కీరవాణి చెప్పిన దాని ప్రకారం ఈ సినిమా 2027 వేసవిలో వస్తున్న ఈ సినిమా ఇండియన్ సినిమాను మరో ఎత్తుకు తీసుకువెళ్లేలా అయితే కచ్చితంగా కనిపిస్తోంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola