Varanasi Movie Chhinnamasta Devi Story | వారణాసి ట్రైలర్ లో చూపించిన చినమస్తాదేవి కథ తెలుసా.? | ABP Desam

Continues below advertisement

 దర్శక ధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కలయిక లో వస్తున్న వారణాసి సినిమా ఫై అంచనాలు స్కై లెవెల్ లో ఉన్నాయి.  ఇటీవల ఆ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ సందర్బంగా చూపించిన విజువల్ లో ఒక దేవత విగ్రహం ఇప్పుడు వైరల్ అవుతోంది. చాలామంది ఆ దేవతను కాళీ మాత అనుకుంటున్నారు కానీ అది నిజం కాదు. ఆమె పేరు 'చినమస్తాదేవి'. చాలా ప్రాచీన గ్రంధాల్లో నిక్షిప్తమై ఉన్న ఆ దేవత తనలో చాలా రహస్యాలు దాచుకుంది. ఇంతకూ ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం.'చిన మస్త' అనే మాటకు అర్ధం 'శిరస్సు తెగిన స్త్రీ 'అని అర్ధం. ఆమెను రకరకాల గ్రంథాల్లో రకరకాల పేర్లతో పిలిచారు. చిన మస్త, చిన్న మస్తా, ప్రచండ చండిక, జోగని మా లాంటి పేర్లు ఆమెకు ఉన్నాయి. సాధారణం గా ఒక నగ్నం గా ఉన్న స్త్రీ మూర్తి తన తలను తానే నరుక్కుని ఆ తలను ఒక చేత్తో పట్టుకుని ఉన్నట్టు ఆమె రూపం ఉంటుంది. మరో చేతిలో రక్తం ఓడుతున్న కత్తి ఉండగా ఆమె మెడలో పుర్రెలతో వేలాడుతున్న దండ, నాగుపాము ఉంటాయి. ఆమె కంఠం నుండి మూడు రక్తపు ధారలు పైకి చిమ్ముతూ ఉండగా రెండు ధారలను నగ్నం గా ఉన్న ఇద్దరు స్త్రీలు తాగుతుండగా మూడో రక్తపు ధారను ఆ స్త్రీ దేవత తెగిన శిరస్సు స్వయంగా తాగుతుంటుంది. ఆమె కాళ్ల దగ్గర ఒక స్త్రీ పురుషుడు సృష్టి కార్యం లో మునిగిఉంటారు. చూడగానే గగ్గుర్పాటు కలిగించే అ దేవత నే 'చిన మస్త దేవి.'

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola