Tribute to Sirivennela: దివికేగిన అమరసాహిత్యం..అక్షరసేద్యం...నిరతం చరితం...సస్యగీతం..!
నువ్వు కేవలం సినిమా కవివా...ఒకవేళ అవునంటే నువ్వు మాకు గుర్తుండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేం చాలా మందిని మరిచిపోయాం. మాకుండే హడావిడి జీవితంలో ఓ రెండొందలు ఇచ్చి చూసే రెండున్నర గంటల సినిమాలో నీకుండే స్పేస్ మహా అయితే ఐదు నిమిషాలు.. మరి ఆ స్పేస్ లో మా కోసం ఇంత చేశావంటే....సినిమా కవి అనే పరిధిని ఎప్పుడో దాటిపోయావ్. మా అనుమతి లేకుండానే మా జీవితాల్లోకి వచ్చావ్. ఓ ఫ్రెండ్ లా, ఓ గైడ్ లా...ఓ మెంటార్ లా ఉంటూ....లిరిసిస్ట్ ప్రహరీని దాటొచ్చి మాతో కలిసి ఇన్నాళ్లూ ప్రయాణం చేశావ్. నువ్వు ధైర్యం చెప్పిన మాటలు....కళ్లు తుడిచిన సందర్భాలు...ఒకటా రెండా. నీకున్న భాషా పరిజ్ఞానం...అపార అనుభవ సారాన్ని మా ముందు ఎన్నో సార్లు పెట్టాలని ప్రయత్నించావ్. కొన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేశాం. కొన్ని ఎప్పటికీ మాకర్థం కావని వదిలేశామ్. మరికొన్ని మా అనుభవాల్లో కి వచ్చినప్పుడు .....అరె నిజమే కదా ఆయనో ఎప్పుడో రాశాడు మన మట్టి బుర్రలకే అర్థం కాలేదు అని అనుకున్నాం. తప్పు మాదే