Tollywood Actors Support for Flood Relief | ముఖ్యమంత్రి సహాయనిధికి హీరోల భారీ విరాళాలు | ABP Desam
Tollywood Actors Support for Flood Relief | ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వరదలు మిగిల్చిన ఘోర విషాదం నుంచి ప్రజలు ఇంకా కోలుకోలేదు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు వరద బాధితులకు పునరావాసం కల్పించి వారి కష్టాలను తీర్చేందుకు కృషి చేస్తున్నాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో సినిమా హీరోలు తామున్నామంటూ ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. రెబల్ స్టార్ ప్రభాస్ రెండు కోట్ల రూపాయల భారీ విరాళాన్ని సీఎం సహాయనిధికి ప్రకటించారు. రెండు తెలుగురాష్ట్రాల సీఎం సహాయనిధికి కోటి రూపాయల చొప్పున పంపిస్తున్నట్లు డార్లింగ్ ప్రకటించాడు. మెగా స్టార్ చిరంజీవి కోటి రూపాయలు, జూనియర్ ఎన్టీఆర్ కోటి రూపాయలు, అల్లు అర్జున్ కోటి రూపాయలు, మహేశ్ బాబు కోటి రూపాయలు ప్రకటించి రెండు రాష్ట్రాల సీఎంవోలకు చెరో 50 లక్షలు పంపిస్తున్నట్లు ట్వీట్ చేశారు. చిన్న హీరోలైనా విశ్వక్ సేన్ 10 లక్షలు, సిద్ధు జొన్నలగడ్డ 30 లక్షలు, త్రివిక్రమ్ శ్రీనివాస్, హారికా హాసినీ ప్రొడక్షన్ హౌస్ కలిపి 50 లక్షల రూపాయలను చెరిసగం చేసి రెండు రాష్ట్రాల సీఎంఓలకు ప్రకటించాయి. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరద సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ప్రభుత్వం తరపున సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించటంతో పాటు తన వంతు సాయంగా వ్యక్తిగతంగా కోటి రూపాయల విరాళాన్ని ఏపీ సీఎంఓకు ఇస్తున్నట్లు ప్రకటించి పెద్ద మనసు చాటుకున్నారు. ఇక హీరోయిన్లలో అనన్యా నాగళ్ల ఐదులక్షల రూపాయలు, యాంకర్ స్రవంతి చొక్కారపు లక్ష రూపాయల విరాళాన్ని రెండు సీఎంఓలకు పంపించి ఈ కష్టసమయంలో ప్రజల కోసం అండగా నిలబడ్డారు.