The Paradise Glimpse : RAW STATEMENT - నాని, శ్రీకాంత్ మళ్లీ మరణమాస్..కానీ ఆ బూతు ఓకేనా | ABP Desam

ఒక్క నిమిషం. ఒక్క నిమిషం..నువ్వు ఈపాటికే థంబ్ నైల్ చూసి కామెంట్ పెట్టడానికి..నువ్వు నాని ఫ్యాన్ వి అయితే నన్ను తిట్టడానికి రెడీ అయిపోతున్నావని నాకు తెలుసు. నువ్వు రిలాక్స్ కా ఒక్క నిమిషం. మనం కాసేపు మాట్లాడుకుందాం. అప్పటికీ నేను తప్పని పిస్తే అక్కడి తిట్టేసి వెళ్లు నో ప్రాబ్లం.నాని కొత్త సినిమా ప్యారడైజ్ టీజర్ వచ్చింది ఇవాళ. శ్రీకాంత్ ఓదెల అని అత్యంత అమాయకంగా ఇంట్రోవర్ట్ లా కనిపించే మాస్ మసాలా డైరెక్టర్ నుంచి వస్తున్న మరో రా అండ్ అథంటిక్ సినిమా ఇది. టీజర్ చూసి చెప్పేయొచ్చు నాని, ఓదెల కలిసి మరణ తాండవం ఆడబోతున్నారు. దసరా సినిమాకు మించి హై ఉండేలా టీజర్ డిజైన్ చేశారు. దాదాపు టీజర్ కే కోటి రూపాయల దాకా ఖర్చు పెట్టారని టాక్ కూడా వచ్చింది. సో టీజర్ లో చెప్పిన కథ చూస్తే వాళ్లో ఎబాండెండ్ మాబ్. సంఘంలో ఉండే విపరీతమైన సప్రెషన్ కి అణగారిపోయిన జాతి కథ ఇది. అందుకే వాయిస్ ఓవర్ లోనే చెప్పించారు చరిత్రలో అందరూ చిలుకలు, పావురాల కథల గురించి రాశారు అదే పక్షి జాతికి చెందిన కాకుల గురించి ఎవ్వడూ రాయలేదు. ఇది కడుపు మండిన కాకుల కథ అని. ఇచ్చి పడేశాడు డైలాగ్. అక్కడే ఆడియెన్ ని లంగర్ వేసి మరీ కథతో లింక్ చేశాడు. హ్యాట్సాప్ టూ శ్రీకాంత్ ఓదెల అండ్ హిస్ రైటింగ్ టీమ్. అమ్మ రొమ్ములో పాలు లేక రక్తం పోసి పెంచిన జాతి కథ. ఒక థగడ్ వచ్చి మొత్తం జాతిలో జోష్ తెచ్చిండు. థూ అనిపించిన కాకులు తల్వార్ పెట్టినాయ్. ఇది ఆ కాకులను ఏకం చేసిన ఓ *** కథ. నా కొడుకు కథ. నీ యమ్మా. టీజర్ ఎండ్ అయ్యింది. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola