Ideas of India 2025 | సీక్రెట్ వెడ్డింగ్ గురించి మాట్లాడిన Taapsee Pannu | ABP Desam

Continues below advertisement

Ideas of India 2025 సమ్మిట్ తన సీక్రెట్ వెడ్డింగ్ గురించి మాట్లాడారు హీరోయిన తాప్సీ పన్నూ. తను ఏడాది క్రితం పెళ్లి చేసుకున్న వ్యక్తితో పదేళ్లుగా ప్రేమలో ఉన్నానని..మీడియా ముందు ఎప్పుడూ ఏమీ దాచలేదని...కానీ అప్పుడు తనను మీడియా పట్టించుకోలేదన్నారు తాప్సీ పన్నూ. ఇంకా ఆమె ఏమన్నారంటే "నేను పెళ్లి చేసుకుని ఏడాది దాటేసింది. అంతకు ముందు పదేళ్లుగా అతనితోనే ఉన్నా. నేను ఏదీ దాచి పెట్టలేదు. మీడియా ముందు చాలా సార్లు కనిపించాం. అప్పుడు ఎవ్వరూ తనను నన్ను పట్టించుకోలేదు. మా పర్సనల్ విషయం కదా ప్రజలకు తెలియాల్సిన అవసరం లేదు కదా అని నేనే సర్ది చెప్పుకున్నా. అందుకే మా పెళ్లి గురించి కూడా నేనెక్కడా పోస్ట్ చేయలేదు. మా ప్రేమ ఎలా మొదలైందో నేను చెప్పను. మీడియాకు అంతగా ఆసక్తి ఉంటే ఆ లవ్ ఎపిసోడ్ మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి" అన్నారు బాలీవుడ్ హీరోయిన్ తాప్సీ పన్నూ

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola